కరోనా తీవ్రత కారణంగా రాష్ట్రంలో బ్రాహ్మణులు దుర్భర జీవితం గడుపుతున్నారని తెదేపా నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల అంత్యక్రియలకు తెదేపా ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల ఆర్థిక సాయాన్ని జగన్ రెడ్డి నిలిపివేశారని చెప్పారు. కరోనా కారణంగా ప్రతి జిల్లాలో దాదాపు 300మంది వరకూ బ్రాహ్మణులు చనిపోయారని.. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: జేపీ పవర్స్ : రేపట్నుంచి ఇసుక విక్రయాల బాధ్యతనిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు