ETV Bharat / state

'గ్రామ వాలంటీర్లను స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంచండి' - ఎస్​ఈసీకి వర్ల రామయ్య లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. గ్రామ వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అధికారులు, సిబ్బందిని సొంత డివిజన్లలో నియమించరాదని లేఖలో పేర్కొన్నారు.

tdp leader varla
tdp leader varla
author img

By

Published : Jan 23, 2021, 12:23 PM IST

గ్రామ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి... వారు పని చేస్తున్న రెవెన్యూ డివిజన్‌లో కాకుండా... ఇతర డివిజన్లలో విధులు వేయాలంటూ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.

వైకాపా జెండా రంగుల అంశంలో సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. స్థానిక ఎన్నికలు కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో నిర్వహించాలన్న ఆయన.... పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ సర్వైలెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే ప్రజలు, విధి నిర్వహణలో ఉన్న అధికారులు కరోనా బారిన పడకుండా కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్‌పీపై సోమవారం సుప్రీంలో విచారణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.