ETV Bharat / state

ఇళ్ల స్థలాల కొనుగోలులో అక్రమాలు... అధికార పార్టీ నేతల హస్తం

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని తెదేపా నేత తంగిరాల సౌమ్య ఆరోపించారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో నివాసయోగ్యం కాని భూములకు అధిక ధర ఇచ్చి కొన్నారని ఆక్షేపించారు. అధికార పార్టీ నేతల జేబులు నింపుకునేందుకు తక్కువ ధర భూములను ప్రభుత్వం చేత ఎక్కువ ధరకు కొనుగోలు చేయించారని విమర్శించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో... అర్హుల పేర్లు తొలగించారని సౌమ్య ఆరోపించారు.

తెదేపా నేత తంగిరాల సౌమ్య
తెదేపా నేత తంగిరాల సౌమ్య
author img

By

Published : Jul 17, 2020, 6:03 PM IST

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు తమ జేబులు నింపుకోవడానికి నివాసయోగ్యం కాని స్థలాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని తెదేపా నేత తంగిరాల సౌమ్య ఆరోపించారు. వైకాపా నాయకులు భూముల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆమె...గ్రామాలకు 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడు నేలలు, కుంటలు, చెరువుల భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని ఆరోపించారు. వీరులపాడు మండలం జూజ్జురు గ్రామంలో, చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఇళ్ల స్థలాలు పూర్తిగా నీటితో నిండి పోయి చెరువులను తలపిస్తున్నాయని విమర్శించారు.

కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో శ్మశాన వాటికల వద్ద స్థలాలను కేటాయించారని, కంచికచర్ల మండలం పరిటాలలో... చెరువు భూములను కొనుగోలు చేశారన్నారు. వేములపల్లి, పెండ్యాల గ్రామాలలో భూములు మున్నేరు వద్ద కొనుగోలు చేశారని, కంచికచర్ల మండలం కీసర, చందర్లపాడు గ్రామాలలో చౌడు భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించారని విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీలోనూ అక్రమాలు జరిగాయన్నారు. అర్హులైన పేదవారిని ఇళ్ల పట్టాల జాబితాల నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. నందిగామ నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని సౌమ్య ఆరోపించారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల పెరుగుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.