ముఖ్యమంత్రి జగన్‌కు విపత్తులను ఎదుర్కొనే అనుభవం లేకపోతే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసైనా నేర్చుకోవాలని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హితవు పలికారు. కరోనా పెద్ద సమస్య కాదని, జలుబు, జ్వరంతో సమానమన్న సీఎం వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కరోనా ప్రభావంతో రైతులు, కూలీలు, వివిధ రంగాలపై ఆధారపడిన వారు సమస్యల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఆకలి బాధల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సోమిరెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామిక, ఆక్వా, అగ్రి, హార్టికల్చర్ తదితర రంగాలు కుదేలయ్యే ప్రమాదముందన్న ఆయన.. వీటిని అధిగమించేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: