వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 5,024 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండగా, రాష్ట్రానికి అవసరం లేకపోయినా... ప్రజాధనం దోపిడీయే లక్ష్యంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ఆరోపించారు.
వైఎస్ అవినాశ్‌రెడ్డి బినామీ అయిన విశ్వేశ్వర్‌రెడ్డికి చెందిన ఎలక్ట్రికల్స్‌కు ఈ సోలార్ టెండర్లు కట్టబెట్టి... లక్షా 20 వేల కోట్ల దోపిడీకి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. కడప, ప్రకాశం జిల్లాల్లో సోలార్ పవర్ పార్కుల నిర్మాణానికి దాఖలైన 24 బిడ్లలలో... అత్యధికంగా విశ్వేశ్వర్‌రెడ్డికి చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థే దాఖలు చేసిందని అన్నారు.
సోలార్ పవర్ ప్రాజెక్టులను అనాకారీ సంస్థకు కట్టబెట్టడం కోసం జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా జీవోలు జారీ చేసిందని విమర్శించారు. పీపీఏల కాలపరిమితి 25 ఏళ్లు పెట్టుకుంటారా అని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి... నేడు 30 ఏళ్లకు ఏ దోపిడీ కోసం పెంచారని నిలదీశారు.
ఇదీ చదవండి: