Kollu Ravindra protest at Machilipatnam: కృష్ణాజిల్లా మచిలీపట్నం నోబుల్ కాలనీలో మున్సిపల్ పార్కు స్థలం ఆక్రమణను.. నిరసిస్తూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఛాంబర్లో బైఠాయించారు. అధికార వైకాపా నేతలు ఇష్టారీతిన పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని శాశ్వత కట్టడం చేస్తుంటే.. వారికి తొత్తుగా కమిషనర్ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పార్కు స్థలానికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్కులను అధికార వైకాపా నేతలు ఆక్రమించుకుంటుంటే చోద్యం చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఆక్రమణలకు సంబంధించిన అనుమతులపై కమిషనర్ క్లారిటీ ఇవ్వకపోవటంతో ఆయన ముందే కూర్చుని నిరసన తెలియజేశారు. అనుమతులు చూపేవరకు కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.
ఇదీ చదవండి: