మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన 36 గంటల నిరవధిక నిరాహార దీక్షను మచిలీపట్నంలో ఆయన ఇంటివద్ద కొనసాగిస్తున్నారు. ఇసుక కొరతపై ప్రభుత్వం అలసత్వాన్ని వీడాలంటూ, గాంధీ అహింసా మార్గంలో దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. తన దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు రాత్రి నుంచి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా సామాన్యులకు ఇంకా ఇసుక దొరకడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. సామాన్యులకు ఇసుక చేరేవరకూ తమ నిరసనలను కొనసాగిస్తామని కొల్లు చెప్పారు.
ఇదీ చూడండి: కొల్లు రవీంద్ర దీక్ష భగ్నం.. నేతల గృహ నిర్బంధం