వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తమ పార్టీ నేతల అరెస్టులను ఖండిస్తూ కృష్ణా జిల్లా మైలవరంలో కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధిస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు జగన్ సర్కార్‌కి చెంపపెట్టులాంటిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం: ఎస్‌ఈసీ