నివర్ తుపాను కారణంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని దేవినేని ఉమా దుయ్యబట్టారు. ఈ నెల 18న జరిగే మంత్రి మండలి సమావేశంలో రైతులు చెప్పే బాధలు వినాలని ఆయన కోరారు. సుమారు 8 లక్షల రేషన్ కార్డుల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఆరోపించారు.
ధాన్యం కొనే దిక్కు లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర గడ్డు పరిస్థితుల్లో ఉంటే అంతా బాగుందని ప్రభుత్వం ఎలా చెబుతుందని దేవినేని నిలదీశారు.
ఇదీ చదవండి: