తెదేపాలో వర్గ పోరు ఉండదని.. అంతా చంద్రబాబు వర్గం మాత్రమే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. చిన్నచిన్న వివాదాలు ఉన్నా వాటిని అధినేత జోక్యం చేసుకొని పరిష్కరిస్తారన్నారు. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు ఆదేశాలను అందరూ గౌరవిస్తారని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో వివాదం ఉంటే ఆయనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
విజయవాడ మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ధరణ కాలేదని బొండా ఉమ పేర్కొన్నారు. అధిష్టానం ఎవరి పేరును సూచిస్తే వారికే తమ సహకారం ఉంటుందని తెలిపారు. అప్పటి వరకు ఎవరి పేర్లు చెప్పకుండా నాయకులు ఓపికతో ఉండాలని పార్టీ శ్రేణులకు బొండా ఉమ సూచించారు.
ఇదీ చదవండి: ఎస్‍ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ.. నాలుగు వారాలకు వాయిదా