కరోనా నివారణలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే 3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనాను నివారించటం చేతకాక ప్రభుత్వం చేతులెత్తేసిందని... ప్రజలే తమ ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. కరోనా పరీక్షల ఫలితాలు వారం రోజులకు కూడా రావటం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి... రాజధాని మార్పు, భూముల ఆక్రమణపై దృష్టి పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూముల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:
ఇంట్లోని ట్రంకుపెట్టెల్లో బంగారం, వెండి నిల్వలు.. పోలీసుల సోదాలు