ఏపీ-తెలంగాణా సరిహద్దుల్లో ప్రతిసారీ పంచాయితీలేంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పొందుగుల వద్ద వాహనదారులపై మళ్లీ లాఠీచార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టవా అని నిలదీశారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా.. అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఇరురాష్ట్రాల సీఎంలు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. కనీస మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
వైకాపా మంత్రినో, ఎమ్మెల్యేనో ఆపితే జగన్ చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. సమన్వయానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆయన.. సమస్య పునరావృతమైతే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ఇవీ చూడండి...