Gudivada mini Mahanadu Postponed: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో రేపు(బుధవారం) జరగాల్సిన తెలుగుదేశం మినీ మహానాడు వాయిదా పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న విషయాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి జిల్లా నేతలు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం వాయిదా వేయాలని అధినేత ఆదేశించారు. గుడివాడ మహానాడు నిర్వహించాకే మరో కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు.
గుడివాడ నియోజకవర్గం అంగళూరులో బహిరంగ సభకు తెదేపా నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. నల్లరేగడి పొలాల్లోని సభా ప్రాంగణం వర్షానికి బురదమయమైంది. పూర్తిగా వర్షం తెరిపినిచ్చినా.. ఆరాలంటే 2రోజులైనా సమయం పడుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. పార్కింగ్ స్ధలం కూడా బురదమయం కావడంతో వాహనాలు దిగబడే ప్రమాదం ఉందని నేతలు సూచించారు. దీంతో సభను వాయిదా వేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తదుపరి తేదీ ఖరారు చేయాలని నేతలను ఆదేశించారు.
ఇదీ చదవండి: LOKESH: అందరూ అయిపోయారు.. ఇక పాత్రికేయులపైనా..: లోకేశ్