ETV Bharat / state

'రైతుల తరఫున న్యాయపోరాటం చేసేందుకు తెదేపా సిద్ధం' - కృష్ణా జిల్లా నేటి వార్తలు

కృష్ణా జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. తోటరావులపాడులోని ధాన్యం కల్లాలను పరిశీలించారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

TDP farmer mla tour in thotaravulapadu
ధాన్యాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
author img

By

Published : Apr 30, 2020, 6:24 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో ధాన్యం కల్లాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళారుల ద్వారా క్వింటా ధాన్యానికి ఏడు కేజీల ధాన్యాన్ని రైతులు తరుగు రూపంలో నష్టపోతున్నారన్నారు. అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరఫున న్యాయ పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. కంచికచర్ల మండలం వేములపల్లిలో గ్రామస్థులకు కూరగాయలు పంపిణీ చేశారు.

ఇదీచదవండి.

వలస కూలీలకు.. 'అమృత' హస్తం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.