రాజధాని రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని... మాజీఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఆరోపించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతుల్లో రాజకీయం ప్రవేశపెట్టి కొందరిని రెచ్చగొడుతూ... విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. 5వేల మంది ఉద్యోగుల స్థిర నివాసానికి అక్కడ నిర్మాణాలు చేపడితే ఏమీ జరగలేదని ప్రభుత్వం ఆరోపించడం దారుణమని శ్రావణ్‌కుమార్ ఆక్షేపించారు.
ఇదీ చదవండి: 'భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే తెదేపా తపన'