ETV Bharat / state

అటవీశాఖ ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్​పై తెదేపా ఫిర్యాదు - కొండపల్లి అటవీ ప్రాంతం

కొండపల్లి అటవీ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ అక్రమమైనింగ్ కు పాల్పడుతున్నారని.. కేంద్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎన్‌.ప్రతాప్‌కుమార్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మైనింగ్ కోసం కొండపల్లి బొమ్మల తయారీకి ప్రసిద్ధి గాంచిన తెల్లపోని చెట్లను నరికి వేయటంవల్ల బొమ్మల తయారీ జీవనోపాధికి ముప్పు ఏర్పడిందని, ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
author img

By

Published : Aug 6, 2021, 5:25 PM IST

కొండపల్లి అడవి ప్రాంతంలో అటవీ చట్టాలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌ జరుగుతోందని కేంద్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎన్‌.ప్రతాప్‌కుమార్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ అక్రమ మైనింగ్‌ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తెదేపా నియమించిన నిజనిర్థారణ కమిటీ సభ్యులు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురామ్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తంగిరాల సౌమ్య, నాగుల్ మీరాలు ఫిర్యాదు లేఖలో సంతకాలు చేశారు.

"కొండపల్లి అటవీ ప్రాంతంలో అనేక జాతులకు చెందిన జంతుజాలం, వృక్షజాలం ఆధారపడి ఉంది. మైనింగ్ కోసం కొండపల్లి బొమ్మల తయారీకి ప్రసిద్ధి గాంచిన తెల్లపోని చెట్లను నరికి వేయటం వల్ల బొమ్మల తయారీ జీవనోపాధికి ముప్పు ఏర్పడింది. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం. దీనిపై మాజీ మంత్రి దేవినేని ఉమా జూలై 27న అక్రమమైనింగ్ ని పరిశీలిస్తే వైకాపా గూండాలు ఆయనపై దాడి చేశారు. పోలీసులు అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన వారిపైనే ఎదురు అక్రమకేసులు నమోదుచేశారు. అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు తెదేపా నియమించిన నిజనిర్థారణ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలి" అని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​పై.. కేంద్ర మంత్రికి తెదేపా ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.