విజయవాడలో నగర పాలకసంస్థ ఎన్నికల ప్రచారం జోరు క్రమంగా పెరుగుతోంది. తెదేపా, వైకాపా నేతలు ఇంటింటికి తిరిగి తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నారు. కృష్ణలంకలోని 17వ డివిజన్లో తెదేపా, వైకాపా నేతలు ప్రచారం నిర్వహించారు. ఇరు పార్టీల నేతలు ఒకే రహదారిపైకి రావటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వైకాపా, తెదేపాకు చెందిన మద్దతుదారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
వైకాపా అభ్యర్థి తంగిరాల రామిరెడ్డి ఇంటింటికి తిరుగుతూ... కరపత్రాలు పంచుతున్నారు. ప్రజాభిమానంతో తప్పకుండా గెలుస్తామని, అందుకే తాను గెలిచిన అనంతరం ఏం చేస్తానో వివరించేందుకు మ్యానిఫెస్టోని తయారు చేసినట్లు పేర్కొన్నారు. సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేతో బహిరంగ చర్చకు సిద్ధమేనని 17వ కార్పోరేషన్ డివిజన్ అభ్యర్థి రామిరెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి...