ETV Bharat / state

అనుమతులు లేకుండా కొవిడ్​ చికిత్స..ఆస్పత్రిపై అధికారుల దాడులు

author img

By

Published : May 28, 2021, 9:08 AM IST

జనం కరోనాతో పోరాడుతుంటే.. ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేట్​ ఆసుపత్రులు బాధితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. అధిక ఫీజులు వసూళ్లు చేయటంతోపాటుగా.. అనుమతులు లేకపోయినప్పటికీ.. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నాయి. అనుమతి లేకుండా కొవిడ్ రోగులకు వైద్యం చేస్తున్న జి.కొండూరు స్పందన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​లో అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో పలు అంశాలు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు.

spandana hospital
అనుమతులు లేకుండా కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రి

కృష్ణా జిల్లా జి.కొండూరు స్పందన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​లో టాస్క్​ఫోర్స్ & విజిలెన్స్ అధికారుల దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా కొవిడ్ ఆసుపత్రి నడుపుతున్నట్లు గుర్తించారు. కొవిడ్ బారిన పడిన ముగ్గురు పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. 7 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కనుగొన్నట్లు సీఐ తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు హాస్పిటల్​పై జి.కొండూరు పీఎస్​లో కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

కల్పతరువు : మోనోక్లోనల్‌ యాంటీబాడీ​తో వారంలోనే వైరస్ మటుమాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.