కేంద్ర ప్రభుత్వం....రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా గత ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని తనవిగా ప్రచారం చేసుకున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోదర్ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఇసకా సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ లాంటి మహానేతను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని....రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి వచ్చే ఐదేళ్లలో న్యాయం చేసేందుకు భాజపా కృషి చేస్తోందని సునీల్ దియోదర్ అభిప్రాయపడ్డారు.ప్రధాని మోదీ నాయకత్వ లక్షణాలను చూసి ప్రతి ఒక్కరూ భాజపాలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
'ఇన్నాళ్లూ పథకాలు కేంద్రానివి.. ప్రచారం బాబుది' - bjp
చంద్రబాబుపై భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోదర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టినట్లుగా తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రచారం చేసుకున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం....రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా గత ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని తనవిగా ప్రచారం చేసుకున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోదర్ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఇసకా సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ లాంటి మహానేతను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని....రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి వచ్చే ఐదేళ్లలో న్యాయం చేసేందుకు భాజపా కృషి చేస్తోందని సునీల్ దియోదర్ అభిప్రాయపడ్డారు.ప్రధాని మోదీ నాయకత్వ లక్షణాలను చూసి ప్రతి ఒక్కరూ భాజపాలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
బైట్స్
శ్రీనివాసులు లు డీఎస్పీ మైదుకూరు
హంతకులను త్వరగా అరెస్టు చేసినందుకు పోరుమామిళ్ల సిఐ మోహన్ రెడ్డి తో పాటు పోలీసులను డి.ఎస్.పి అభినందించారు అభినందించారు.