కృష్ణా జిల్లా నూజివీడులో యువతి ఆత్మహత్య చేసుకుంది. తిరువూరుకు చెందిన సౌజన్య అనే విద్యార్థిని నూజివీడులోని ఎం.ఆర్.అప్పారావు కృష్ణ యూనివర్శిటీ పీజీ సెంటర్లో ఎంఎస్సీ ఆర్గానిక్ సైన్స్ మొదటి ఏడాది చదువుతోంది. ఈరోజు మధ్యాహ్నం పరీక్షకు హాజరైంది.
అనంతరం పట్టణ పరిధిలోని కృష్ణారెడ్డి కాలనీ సమీపంలో పురుగుమందు సేవించింది. ఇది గమనించిన సమీపంలోని రైతులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: