రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తమ వివరాలను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని... ఆ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి జూన్ 9 సాయంత్రం ఐదు గంటల వరకు వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇలా చేయని సంస్థలను ఈ విద్యా సంవత్సరానికి ఫీజు వసూలుకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచొద్దని పునరుద్ఘాటించారు. ఏ విద్యాసంస్థ అయినా ఫీజులు అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని... ఒక వేళ తల్లిదండ్రులు ఆ ట్యూషన్ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే వాయిదాలు కట్టే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఫీజులను విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాతే వసూలు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి