రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మరో పక్క విజయవాడలో మూడు గంటలపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలన్నీ వాగులను తలపించాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని పలు ప్రాంతాల్లో వాన కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని కనకాయలంకలో వరద నీరు వచ్చి చేరడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు, వేటపాలెం, మార్టూరులోను మోస్తరు వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, డోన్, బనగానపల్లె పరిధిలో వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేసున్నారు.
గుంటూరులో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చుట్టుగుంట, మూడు వంతెనలు, అమరావతి రోడ్డు, నందివెలుగు రోడ్డు, సంగడిగుంట, ప్రధాన కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటితో మురుగు కాలువలు పొంగుతున్నాయి. దీనితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి : గల గల గోదావరి... ఏలేరు చేరె!