విజయవాడ సిద్దార్ధ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో హరిత ప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, ఏపీ రోజ్ సొసైటీ, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పుష్పప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. విరబూసిన గులాబీలు... రంగురంగుల చామంతులు, ముద్ద మందారాలు ఆకట్టుకునే వర్ణాలలో విభిన్న రకాల పూల మొక్కలు...అలంకరణ మొక్కలు, చిట్టిపొట్టి మొక్కలు అన్నీ ఒకేచోట కొలువు దీరాయి.. వంద రంగులకుపైగా పూల మొక్కలున్నాయంటున్నారు నిర్వహకులు. ఈ పుష్ప ప్రదర్శనలో 20 రంగుల్లో ఉన్న హైబ్రీడ్ చామంతులను ప్రదర్శన అమ్మకానికి పెట్టారు. పుష్పాలతోపాటు ఆర్కిడ్స్ మొక్కలను ఎక్కువమంది ఆదరిస్తున్నారు. సుమారు 17 రంగుల ఆర్కిడ్స్ ప్రదర్శనలో పెట్టారు.
ఇదీచూడండి.ఉత్సాహంగా ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల "యువర్ ఫెస్ట్"