ETV Bharat / state

మరో కొత్త పథకం... పేద వ్యాధిగ్రస్తులకు సాయం - ap latest schemes news in telugu

రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రవేశపెట్టింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించనుంది. పోస్ట్‌ ఆపరేటివ్‌ సస్టెయినెన్స్‌ అలవెన్సు కింద రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో సర్జరీ తర్వాత ఆర్థికసాయం అందించనుంది.

మరో కొత్త పథకం... పేద వ్యాధిగ్రస్తులకు సాయం
author img

By

Published : Oct 27, 2019, 12:09 PM IST

ఆస్పత్రుల్లో సర్జరీ తర్వాత పేద వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. సర్జరీ అనంతరం రోగికి రోజువారీ అలవెన్సు కింద రూ.225 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు గరిష్టంగా రూ.5వేలు మించకుండా పోస్ట్‌ ఆపరేటివ్‌ సస్టెయినెన్స్‌ అలవెన్స్‌ కింద ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు నిధుల నుంచి రోగులకు ఈ అలవెన్సు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 డిసెంబరు 1 నుంచి అలవెన్సు పంపిణీ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

అరుదైన వ్యాధిగ్రస్తులకు అండగా...
అరుదైన వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని మరికొన్ని వ్యాధులకు వర్తింపజేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద నెలవారీ పింఛన్లు అందించేందుకు మరో 6వ్యాధులను నోటిఫై చేస్తూ... వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు రూ.10వేలు, గ్రేడ్-4 స్థాయిలో ఉన్న బోదకాలు వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, మస్క్యులర్ డిస్ట్రోఫీ, ప్రమాదాల బారిన పడి మంచాన పడిన వారికి, తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి రూ.5వేలు చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీచూడండి.సచివాలయ ఉద్యోగ నియామకాల్లో అర్హత మార్కులు తగ్గించే అవకాశం !

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.