తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైకాపాలోకి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం విజయవాడలోని ఆయన నివాసంలో అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ను కలిసి నిర్ణయం తెలుపనున్నారు. పార్టీ మారనున్న విషయాన్ని ఆయన ముఖ్య అనుచరుడు, మాజీ కార్పొరేటర్ కడియాల బుచ్చిబాబు 'ఈనాడు'తో చెప్పారు. అవినాష్ మాజీ మంత్రి, దివంగత దేవినేని నెహ్రు తనయుడు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిసింది.
వైకాపాలోకి దేవినేని అవినాష్?.. విజయవాడ తూర్పుపై గురి - వైకాపాలోకి దేవినేని అవినాష్
తెదేపా యువ నాయకుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైకాపా కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైకాపాలోకి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం విజయవాడలోని ఆయన నివాసంలో అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ను కలిసి నిర్ణయం తెలుపనున్నారు. పార్టీ మారనున్న విషయాన్ని ఆయన ముఖ్య అనుచరుడు, మాజీ కార్పొరేటర్ కడియాల బుచ్చిబాబు 'ఈనాడు'తో చెప్పారు. అవినాష్ మాజీ మంత్రి, దివంగత దేవినేని నెహ్రు తనయుడు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిసింది.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్... పార్టీ మారనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గురువారం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో అవినాష్.. వైకాపాలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇసుక సమస్యతో రాష్ట్రమంతటా ఉద్యమాలు జరుగుతున్న వేళ... ఇలాంటి వార్త రావడం చర్చనీయాంశమైంది. అందునా.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. ఇసుక దీక్ష చేపట్టనున్న రోజే.. తెదేపాకు చెందిన ముఖ్య నేతను వైకాపాలో చేర్చుకుంటున్నారన్న వార్త బయటికి రావడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఇదంతా తెదేపా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే అన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తపరుస్తున్నాయి.
Conclusion: