కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆయన అభిమానులు పూజులు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల జలదీశ్వరాలయంలో ఎస్పీ బాలు పేరు మీద అర్చనలు, అభిషేకాలు చేశారు. చెన్నైలోని ఘంటసాల వెంకటేశ్వరరావు కుటుంబసభ్యుల కోరిక మేరకు శివాలయాల్లో పూజాదికాలు నిర్వహించారు. మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని కోరుకున్నారు.
ఇవీ చదవండి...