ETV Bharat / state

SONUSOOD: విజయవాడలో ఇల్లు కట్టుకుంటా: సోనూసూద్ - సినీ నటుడు సోనూసూద్

విజయవాడు కనక దుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ దర్శించుకున్నారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని సోనూసూద్‌ తెలిపారు.

సోనూసూద్
సోనూసూద్
author img

By

Published : Sep 9, 2021, 3:18 PM IST

Updated : Sep 9, 2021, 7:24 PM IST

విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సోనూసూద్

కరోనా కష్టకాలం నుంచి ప్రజలంతా కోలుకుని తిరిగి సాధారణ జీవనం సాగించేలా కనకదుర్గమ్మ తన చల్లని ఆశీస్సులు అందించాలని తాను ప్రార్ధించినట్లు సినీనటుడు సోనూసూద్‌ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో సోనూసూద్‌కు దేవస్థానం సిబ్బంది స్వాగతం పలికారు. అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

అంకుర ఆసుపత్రి ఓపెనింగ్..

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే ముందు..విజయవాడలో అంకుర ఆసుపత్రిని సోనూసూద్ ఓపెన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేశారని అన్నారు. అంకుర ఆసుపత్రిలో పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. తల్లీబిడ్డలకు పూర్తిస్థాయిలో నాణ్యమైన వైద్యం అందిస్తారని సోనూసూద్ అన్నారు. కొవిడ్ సమయంలో చిన్నారులకు మెరుగైన వైద్యం అంకురలో అందించారని.. అందుకే ప్రచారకర్తగా ఉన్నానని ఆయన తెలిపారు.

ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లీషు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రజలు ఎంతో ఆదరించారన్నారు. కెరీర్ ప్రారంభంలో ఒకసారి నగరానికి వచ్చానని.. భవిష్యత్​లో విజయవాడలో ఇల్లు కట్టుకునే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చదవండి: వినాయక చవితికి సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Last Updated : Sep 9, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.