తూర్పు కృష్ణా పరిధిలో పాము కాట్లు రోజురోజుకు అధికమవుతున్నాయి. పొలం పనులు ముమ్మరంగా సాగుతుండటంతో రైతులు పొలంలో పనులు చేయటానికి వెళ్తుండగా...పాము కాట్లకు గురవుతున్నారు. పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఘంటసాల, మొవ్వ మండలాల్లో వేర్వేరు ప్రాంతంలో రైతుకూలీలు పాముకాట్లకు గురయ్యారు. వారికి మొవ్వ పీహెచ్లో చికిత్స అందించారు. ఈనెలలో 90 మంది రైతులు, రైతుకూలీలు పాముకాట్లకు గురైనట్లు పీహెచ్ వైద్య అధికారి శివరామకృష్ణరావు వివరించారు. పాము కరిచిన 15 నిమిషాల్లో ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని..నాటువైద్యం జోలికి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
తూర్పు కృష్ణా పరదిలో పెరిగిపోతున్న పాముకాట్లు... - కృష్ణా పరదిలో పెరిగిపోతున్న పాముకాట్లు
తూర్పు కృష్ణా పరిధిలో పాము కాట్లు రోజురోజుకు అధికమవుతున్నాయి. పొలం పనులు ముమ్మరంగా సాగుతుండటంతో రైతులు పొలంలో పనులు చేయటానికి వెళ్తుండగా...పాము కాట్లకు గురవుతున్నారు.