విజయవాడ బస్టాండ్లోని ఆలయంలో.. ధ్వంసమైన సీతమ్మ విగ్రహాన్ని పీసీసీ చీఫ్ శైలజానాథ్ సందర్శించారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. అనుమానం కలుగుతోందని, గతంలో ఇలాంటి దాడులు చూడలేదని అన్నారు. ఈ దాడులకు సంబంధించి రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశాన్ని సీఎం దాస్తున్నారనే భావన కలుగుతోందని చెప్పారు.
రామతీర్ధం ఘటనలో ఇప్పటిదాకా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాజపా వాళ్ళు ఈ రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతూ ఏం చేయాలని చూస్తున్నారంటూ నిలదీశారు. తక్షణమే బాధ్యులను గుర్తించి పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: