ETV Bharat / state

సోము వీర్రాజు ఏకపక్ష వైఖరితోనే పార్టీ వీడుతున్నారు.. రాష్ట్ర ఇంచార్జికి బీజేపీ నేతల ఫిర్యాదు

Bjp leaders complained : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారశైలిపై పలువురు నేతలు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధరన్‌కు ఫిర్యాదు చేశారు. సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాల కారణంగా... అనేకమంది నేతలు పార్టీని వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 23, 2023, 8:54 PM IST

Bjp leaders complained : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపై పలువురు నేతలు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధరన్‌ను ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేశారు. ఏకపక్ష నిర్ణయాల ఫలితంగా పార్టీ బలహీనపడుతోందని చెప్పారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీని వీడిపోయారని గుర్తు చేస్తూ.. కనీస సమాచారం ఇవ్వకుండా పలు జిల్లాల అధ్యక్షులను కూడా తొలగించారని వాపోయారు. సుమారు 20 నిమిషాల పాటు భేటీ జరిగినట్లు తెలుస్తుండగా.. ఇకపై ప్రతీ నెల రెండుసార్లు రాష్ట్రంలో పర్యటిస్తానని మురళీధరన్ తెలిపారు. మీరు ఏ వర్గానికి చెందినవారు.. అంటూ ప్రశ్నించగా.. పార్టీ బలోపేతం కోసం పని చేసేవాళ్లం అని స్పష్టం చేసినట్లు సమాచారం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారశైలిపై పలువురు నేతలు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధరన్‌కు ఫిర్యాదు చేశారు. సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాల కారణంగా.. అనేక మంది నేతలు పార్టీని వీడుతున్నారని, గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ దిగజారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలు జిల్లాల అధ్యక్షులను కనీస సమాచారం ఇవ్వకుండా... తొలగించారని, సీనియర్లను పట్టించుకోవడం లేదని మురళీధరన్‌కు చెప్పినట్లు భేటీ అనంతరం నేతలు తెలిపారు.

ప్రతీ నెల రాష్ట్రంలో రెండు సార్లు పర్యటన.. సుమారు 20 నిముషాల పాటు జరిగిన భేటీలో.. రాష్ట్ర నాయకత్వం నిర్ణయం కారణంగా జరుగుతున్న నష్టాన్ని మురళీధరన్‌కు వివరించారు. దీనికి ఆయన స్పందిస్తూ... రెండు రోజుల్లో రాజమండ్రి పర్యటన ఉందని, అక్కడ కలిసి అన్ని విషయాలు చర్చిస్తానని చెప్పారు. ఇకపై నెలలో రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు మురళీధరన్‌ చెప్పారని.. భేటీ అనంతరం నేతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారని.. అది ఎప్పుడైనా ఉండొచ్చన్నారని నేతలు వెల్లడించారు.

బీజేపీ నేతల ఫిర్యాదు

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని తెలియజేయాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున ఇక్కడకు వచ్చాం. పార్టీ రాష్ట్ర ఇంచార్జి మురళీధరన్ ను కలిసి విన్నవించాం. సీనియర్లు తలెత్తి తిరిగే పరిస్థితి లేదని స్పష్టం చేశాం. పార్టీ ప్రతిష్ట కోల్పోతున్నదని, సరిచేయాలని కోరాం. రాష్ట్ర నాయకత్వ మార్పు గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశాం. - తుమ్మల అంజిబాబు, బీజేపీ నేత

గడిచిన 40ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగరవేయడానికి ఎంతో మంది చేస్తున్న కృషికి గుర్తింపు దక్కడం లేదు. మండలాల అధ్యక్షులను మార్చడం కాదు.. ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించాం. అమరావతి, పోలవరం, జలజీవన్ మిషన్ పై నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర నాయకత్వం స్పందించాలి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. - బాలకోటేశ్వరరావు, బీజేపీ నేత

పార్టీ కోసం పనిచేసేవాళ్లమే... చర్చలో తాము ఏ వర్గానికి చెందినవారని మురళీధరన్‌ ప్రశ్నించగా... తామంతా పార్టీ కోసం పని చేసేవాళ్లం తప్ప... టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే వర్గం కాదు, కన్నా వర్గం కాదు అని స్పష్టం చేశామన్నారు. 18 జిల్లాల నుంచి సుమారు 30 మంది నేతలు మురళీధరన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిలో పార్టీ సీనియర్‌ నేతలు జమ్ముల శ్యాంకిషోర్‌, తుమ్మల అంజిబాబు, బాలకోటేశ్వరరావు సహా... ఇటీవల పదవుల నుంచి తప్పించిన పలు జిల్లాల అధ్యక్షులు కూడా ఉన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.