తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లాలోని పలు రెడ్ జోన్ ప్రాంతంలో విక్రయించేందుకు తెస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వాటర్ క్యాన్ల మధ్య రహస్యంగా అక్రమంగా రవాణా చేస్తున్న నాలుగు వందల క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ లక్ష్మి నారాయణ తెలిపారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
ఇవీ చదవండి: దొరకని రక్తం... తలసేమియా బాధితులకు నరకం