నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో కృష్ణాజిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు.. ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో డీఎస్పీ శ్రీనివాసులు, 85 మంది పోలీసు సిబ్బంది కలిసి ఆపరేషన్ నిర్వహించారు. విస్సన్నపేట మండలంలోని కొర్ర తండా, మరిమండ, చంద్రుపట్ల, తాటాకుల తండాల్లో దాడులు జరిగాయి.
ఈ నిర్బంధ తనిఖీల్లో... 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామని అధికారులు తెలిపారు. 15 లీటర్ల నాటుసారా, 20 కేజీల పటిక, సారా తయారీకి వినియోగించే పాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఎక్కడ నాటుసారా తయారుచేసినా.. అమ్మకాలు జరిపినా.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తయారీదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, మైలవరం, తిరువూరు సీఐలు, విస్సన్నపేట ఎస్సై పాల్గొన్నారు.
ఇదీ చదవండి: