సత్యనారాయణపురం ఏటీఎంలో చోరీకి విఫలయత్నం - సత్యనారాయణపురం ఏటీఎంలో చోరి వార్తలు
విజయవాడ సత్యనారాయణపురం సీతమ్మపేటలో ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషన్ని ధ్వంసం చేసి యంత్రంలోని డబ్బులు ఎత్తికెళ్లే ప్రయత్నం చేశారు. మిషన్ తెరుచుకోకపోవటంతో దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.