ETV Bharat / state

నిబంధనలు అతిక్రమించి ఇసుక రవాణా.. పట్టించుకోని అధికారులు

నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఇసుక ఓవర్ లోడుతో లారీలు వెళ్తున్నా.. ఒకే బిల్లుపై పలుమార్లు ఇసుకను తరలిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

sand illegal transport
నిబంధనలు పాటించని ఇసుక అక్రమదారులు
author img

By

Published : Dec 8, 2020, 9:13 AM IST

కృష్ణా జిల్లా కంచికచర్లలో ఇసుక రవాణాదారులు రెచ్చిపోతున్నారు. నిబంధనలు అతిక్రమించి ఓవర్ లోడుతో లారీల్లో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. అత్కూరు గ్రామంలో పట్టా పొలంలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. ఇదే అదునుగా కొంతమంది నిబంధనలు గాలికి వదిలి ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. లారీల్లో ఓవర్ లోడ్​ చేయటం.. ఒకే బిల్లుపై పలుమార్లు ఇసుకను తీసుకెళ్లటం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు నామమాత్రంగా చర్యలు చేపట్టి.. అధిక లోడ్ లారీలను వెళ్లకుండా చేస్తున్నారు. అధికారులు వెళ్లిన అనంతరం మళ్లీ మొదలు పెడుతున్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయమా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అధికారులు పట్టించుకోకపోవటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

జనావాసాల మధ్య మద్యం దుకాణం వద్దని స్థానికుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.