సంక్రాంతి పండుగను ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. సాధారణ సర్వీసులకు అదనంగా 2,494 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆది, సోమవారల్లో హైదరాబాద్ కు 631 బస్సులను వేశారు. ఆదివారం ఒక్కరోజే 359 బస్సులను నడిపారు.
రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా.. వివిధ జిల్లాల నుంచి విజయవాడ మీదుగా ఎక్కువ బస్సులు నడుస్తున్నాయి. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆయా మార్గాల్లో రద్దీని బట్టి బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి:
పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్