ETV Bharat / state

Road Accidents Today in AP: అంబులెన్స్​ ఆలస్యం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Road Accidents Today in AP : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా.. 22 మందికి గాయాలయ్యాయి. ఒకచోట వ్యవసాయ పనులు చేసుకుని తిరిగి వస్తుడంగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు కూలీలు మరణించారు. మరొక చోట బస్సును లారీ ఢీకొని డ్రైవర్ మృతి చెందగా.. ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Road_accidents_in_AP
Road_accidents_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 5:38 PM IST

Road Accidents Today in AP: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా.. 22మందికి గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం కొంగలవీడు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరోకరికి తీవ్రగాయాలయ‌్యాయి. అట్లూరు మండలం గాండ్లపల్లికు చెందిన చిన్న పెంచలయ్య, రామకుమార్, మల్లీశ్వరయ్య బేల్దారి పనుల నిమిత్తం బద్వేలుకు ద్విచక్ర వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొంగలవీడు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం తగిలి అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిపై దూసుకెళ్లడం వల్ల రామకుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన చిన్నపెంచలయ్య ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. బద్వేల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మల్లీశ్వరయ్యకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల కడప రిమ్స్‌కు తరలించారు. బద్వేల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Road accidents in AP : రాష్ట్రంలో వేేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి..

Road Accidents in AP: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు.. తొమ్మిది మంది మృతి

A Youngman Died Due to Ambulance Late: బైక్​ను ఢీ కొట్టిన టాక్టర్.. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ శివారు ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని టాక్టర్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కనిగిరి పట్టణానికి చెందిన యువతి యువకుడు ద్విచక్ర వాహనంపై పునుగోడు వైపు వెళుతున్నారు. కనిగిరి శివారు ప్రాంతంలో గార్లపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై మితిమీరిన వేగంతో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్.. వీరు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని(bike accident) బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువతి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు కళాశాల విద్యార్థులు.. గాయపడిన వారిని చూసి యువకుడిని 108 కి కాల్ చేశారు. అంబులెన్స్ ఎంతసేపటికి రాకపోయే సరికి.. వెంటనే ఓ ఆటోను పిలిచి ఇద్దరిని ఆసుపత్రికి తరలించారమని విద్యార్థులు తెలిపారు. మార్గ మద్యంలోనే యువకుడు మృతి చెందాడని అన్నారు. సకాలంలో 108 వాహనం వచ్చి ఉంటే యువకుడి ప్రాణాలను కూడా కాపాడగలిగే వాళ్లమని విద్యార్థి తెలిపాడు. మృతుడు కనిగిరి పట్టణములోని ఒకటో వార్డు చెందిన ముస్కూర్ (25) గా పోలీసులు నిర్ధారించారు.

Car Accident in Dhone: మద్యం మత్తులో బైక్​లను ఢీకొట్టి.. బీభత్సం సృష్టించిన కారు.. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు

Bus Accident in Eluru : ఏలూరు శివారులోని కలపర్రు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం హైదరాబాదు నుంచి కాకినాడకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ వెంకటనారాయణ క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. ఎంతో శ్రమించి తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్​ను క్యాబిన్ నుంచి బయటకి తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించాడు. బస్సులో ప్రయాణిస్తున్న 20మంది ప్రయాణికులకు గాయాలు కావడం వల్ల ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident: ఏపీలో వేరు వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు.. 11మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.