బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా.. తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో జరిగింది. ప్రమాద స్థలిలో.. స్థానికులు 108 వాహనంలో బాధితులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆ ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల చికిత్స కోసం విజయవాడ తరలించారు.
ఇద్దరినీ.. నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు తాజూద్దీన్, అతని స్నేహితుడు ఉప్పుశెట్టి నరసింహారావుగా పోలీసులు గుర్తించారు. వీరు మద్యం సేవించి ద్విచక్రవాహనంపై స్వస్థలం వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: