కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులు వి.బాబు(40), వెంకటరమణ(42)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Road accident: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి