కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇద్దరు యువకులు.. నాగాయలంక లోని రైస్ మిల్లులో పని చేస్తున్నారు. మిల్లు యజమాని జీతానికి బదులు బీపీటీ రైస్ ఇస్తామని చెప్పగా.. 800 రూపాయలకే వస్తోందని తీసుకున్నట్టు చెప్పారు.
కానీ.. ఇంటికి వెళ్లి చూసుకున్న తరువాత అవి రేషన్ బియ్యం అని తెలుసుకుని తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కొత్తగా వచ్చి బియ్యం ప్యాకెట్లను అమ్మితే కొన వద్దని బాధిత యువకులు స్థానికులకు సూచించారు.
ఇదీ చూడండి: