కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని పాటించాలంటూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమలు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. టెండర్ కమ్ రివర్స్ యాక్షన్ ద్వారానే కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ పనుల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేసినట్టు ఆర్ధికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు విధిగా ఈ విధానాలను పాటించాలని స్పష్టం చేసింది.
రివర్స్ టెండరింగ్‌లో ఈ-ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. చెల్లింపుల విధానంలోనూ మార్పులు చేయాల్సిందిగా ఏపీ సీఎఫ్ఎస్ఎస్కు సూచనలు జారీ అయ్యాయి. కోటి రూపాయలు దాటిన వస్తు సేవల కొనుగోళ్లు, పనులకు రివర్స్ యాక్షనింగ్ విధానం అమలు కాకుండా, ఎలాంటి చెల్లింపులూ జరగకుండా చూడాలని ఆర్ధికశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: శిరోముండనం కేసుపై కేంద్ర మంత్రికి వర్ల రామయ్య లేఖ