2017 పే స్కేల్ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ... ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు విజయవాడ స్వాతంత్ర్య సమరయోధుల భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బకాయిలు చెల్లించకపోవడంతో తమ జీవనం దుర్భరంగా మారిందని... కరోనా ప్రభావంతో ఇప్పటికే ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సంఘం కార్యదర్శి గంగాధరరావు అన్నారు.
జనవరి 2020 నుంచి విధుల్లో ఉండి చనిపోయిన ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల సెటిల్మెంట్స్ వెంటనే పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతూ... అన్ని డిపోల నుంచి పోస్టు కార్డుల ద్వారా ఆర్టీసీ ఎండీకి వినతులు పంపే కార్యక్రమం చేపట్టామన్నారు. పోస్టుకార్డుల వినతులతో స్పందకపోతే 12 వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామన్నారు.
ఇదీ చదవండి