ప్రతి ఇంటికీ రేషన్ పంపిణీ చేయలేక కొందరు వాహన నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. కృష్ణాజిల్లా నందిగామలో ఇంటింటికీ నిత్యావసర సరకులు పంపిణీ చేసే వాహనం డీజిల్ లేక ఆగిపోయింది. తహసీల్దారు కార్యాలయం రోడ్డులో నిలిచిపోయిన వాహనాన్ని.. ఇతరుల సహాయంతో డ్రైవర్ కొంతదూరం తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
రెండు వేలకు పైగా కార్డుదారులకు ఇంటింటికీ వెళ్లి సరకులు పంపిణీ చేయడం చాలా ఇబ్బందిగా ఉందని వాహన నిర్వాహకులు చెబుతున్నారు. తమపై కొంత భారం తగ్గించాలని తహశీల్దార్ చంద్రశేఖర్‌ను కొందరు కలిసి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
రేడియల్ గేట్ల ట్రయల్‌రన్ పూర్తి.. 2 గేట్లను పైకెత్తి పరిశీలించిన అధికారులు