విజయవాడ శివారు గొల్లపూడి సివిల్ సప్లయర్స్ గోడౌన్ ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. కొవిడ్-19 పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమకు కొవిడ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి, పెండింగ్ కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్లో ఇప్పటి వరకు ఏడు విడతలు ఎలాంటి భద్రతా చర్యలు లేకున్నా.. సరకులు అందించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో నలుగురు రేషన్ డిలర్లు కరోనాతో మరణించినా.. ప్రభుత్వం స్పందించకపొవటం బాధాకరమని ఏపీ రేషన్ డిలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మండాడి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...