కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలోని డా.పిన్నమనేని వైద్య కళాశాల సర్జరీ విభాగం అరుదైన శస్త్రచికిత్స చేసింది. విజయవాడ శివారు పెనమలూరుకు చెందిన చౌటపల్లి దుర్గాంజనేయులు గత రెండేళ్లుగా కడుపులో భారీ గడ్డతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో పిన్నమనేని కళాశాల ఆసుపత్రిని ఆశ్రయించగా.. అతడి కడుపులో సుమారు 12.5 కిలోల గడ్డ ఉన్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా.అనిల్‌కుమార్ నేతృత్వంలోని డా.రెహమాన్ బృందం గుర్తించింది.
శస్త్రచికిత్సతో ప్రాణహాని ఉండొచ్చన్న వైద్యుల నిర్ణయానికి.. బాధితుడు చికిత్సకు అంగీకరించడంతో విజయవంతంగా సర్జరీ చేసి గడ్డను తొలగించారు. చికిత్స అనంతరం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానంటూ దుర్గాంజనేయులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. అరుదైన చికిత్స చేయడంలో విజయం సాధించిన వైద్యులను మంగళవారం కళాశాల డీజీ చదలవాడ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ పీఎస్‌ఎన్.మూర్తి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: మహిళ కడుపులో 8 కిలోల కణితిని తొలగించిన వైద్యులు
ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాన్వీ, సారా.. రొమాన్స్ చేస్తున్న ఫొటోస్ లీక్!
మైనర్‌పై యువకుల గ్యాంగ్‌రేప్.. కిడ్నాప్ చేసి గదిలో బంధించి హింస..