కొండపల్లి ఉత్సవాల్లో భాగంగా ఈ సాహస క్రీడలు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. 17 రాష్ట్రాల యువతీ యువకులు ఆటల్లో పోటీపడుతున్నారు. చిన్నారులూ సాహస క్రీడల్లో ముందుంటున్నారు. 100 అడుగుల ఎత్తులో ఉన్న కొండను ఎక్కడం, రివర్స్ ర్యాప్లింగ్, జిప్ లైనింగ్ లాంటి సాహసాలు చేస్తూ దుమ్మురేపుతున్నారు.
రాప్లింగ్ కోసం బృంద సభ్యులు.. ఆయా రాష్ట్ర యూత్ హాస్టల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా శాఖల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. కొత్తవాళ్లు చేయాలని అనుకుంటే.. నిపుణుల పర్యవేక్షణలో దగ్గరుండి ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని రాప్లింగ్ చేయిస్తారు.