భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాగానే బందరు పోర్టు ఫైలు పై తొలి సంతకం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా....రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పడం లేదన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పోలవరం గురించి పట్టించుకోలేదని....మోదీ అధికారంలోకి రాగానే....పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా...6వేల కోట్ల పైగా నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. భాజపా అధికారంలోకి రాగానే రైతులకు కనీస మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచడమే కాకుండా.....రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా ప్రభుత్వం మాతో ఉన్నా లేకున్నా.....రాష్ట్రానికి చేయూతనివ్వడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అనుభవం ఉన్న నేతగా చంద్రబాబుకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే....తన అనుభవాన్ని ఉపయోగించి ఐదేళ్లలోఅవినీతిని పెంచి పోషించారని రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
ఇవి చూడండి...