వచ్చే ఆర్ధిక సంవత్సరం రాష్ట్రంలో మరికొన్ని కొత్త శాఖలతో తమ పరిధిని మరింత విస్తరింపజేయనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ మేనేజర్ అశుతోష్ చౌదరి తెలిపారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 25 శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు విజయవాడలో మీడియాకు తెలిపారు.
రాష్ట్రంలో 160 బ్రాంచిలతోపాటు 200 ఏటీఎంల ద్వారా ఖాతాదారులకు బ్యాంక్ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం సంస్థ విజయవాడ సర్కిల్ పరిధిలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు అందిస్తోందని.. విశాఖ సర్కిల్ పరిధిలో చిన్నతరహా పరిశ్రమలకు రుణాలు మంజూరు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రేపు సీఎం జగన్ చేతుల మీదుగా 'బియ్యం పంపిణీ వాహనాలు' ప్రారంభం