విజయవాడ రూరల్ మండలం పరిధిలోని జక్కంపూడి, షాబాద గ్రామాల సమీపంలో ప్రమాదం జరిగింది. సర్వే నంబర్ 85లో గ్రావెల్ తవ్వుతుండగా ప్రొక్లైనర్పై ఒక్కసారిగా కొండపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రొక్లైనర్ ఆపరేటర్ మట్టిలో కూరుకుపోయాడు. అక్కడే కూలీపనులు నిర్వహిస్తున్న వారు అక్కడికి చేరుకొని అతన్ని బయటకు తీశారు. మట్టిలో కూరుకుపోయిన ప్రొక్లైనర్ను మరో ప్రొక్లైనర్తో బయటకు తీశారు.
ఇటీవల కాలంలో జక్కంపూడి, షాబాద, కొత్తూరు, తాడేపల్లి ప్రాంతాల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి