విజయవాడ - ఏలూరు రోడ్డు నుంచి గుణదల మూడు వంతెనల సెంటర్కు వెళ్ళే దారిలో పెను ప్రమాదం తప్పింది. గుణదల సెంటర్ నుంచి ఆదర్షనగర్, పడవల రేవు ప్రాతాలకు వెళ్ళే మార్గంలో... మచిలీపట్నం - విజయవాడ రైల్వే లైన్ ఉంది. ఈ మార్గం గుండా ప్రతిరోజు వేలాది మంది విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంటారు. ద్విచక్రవాహనదారుల అత్యుత్సాహం కారణంగా ప్రతి రోజు గంటలు తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్య ఎంతకు చేరుకుందంటే ఏకంగా రైలుకే దారి ఇవ్వనంత విధంగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నం-విజయవాడ పాసింజర్ రైలు విజయవాడ వెళుతుండగా... ట్రాఫిక్ కారణంగా ఈ రైల్వే లైన్ వద్ద గేట్లు మూసుకోలేదు. లోకో పైలట్ అప్రమత్తమవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: