కృష్ణా జిల్లా నందిగామలో డీవీఆర్ (దేవినేని వెంకటరమణ) సామాజిక ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేని కారణంగా.. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఈ వైద్యశాల ఉంది. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను అత్యవసర వైద్యం కోసం ఈ వైద్యశాలకు తీసుకొస్తున్నారు. గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తున్నారు.
బాధితులను మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రలకు తరలించే లోపు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యశాలలో సిబ్బంది పోస్టులు ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఎక్స్ రే, ఈసీజీ, స్కానింగ్ పరికరాలు అందుబాటులో లేవు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు అధునాతన పరికరాలు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. వంద పడకల వైద్యశాలగా అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. దీనిపై సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: